Current Affairs Telugu Daily

తెలంగాణలో ఉపాధి హామీ పనుల్లో మహిళలవి 61% పని దినాలు 
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల్లో మహిళల పాత్ర గణనీయంగా ఉంటోంది. ఇక్కడి మొత్తం పనిదినాల్లో 61 శాతం మహిళలే నిర్వహిస్తున్నారు. కేరళ, తమిళనాడు వంటి అతికొద్ది రాష్ట్రాలను మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల కంటే మహిళా భాగస్వామ్యం తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. తెలంగాణకు 2017-18లో 8 కోట్ల పనిదినాల బడ్జెట్‌కు కేంద్రం అనుమతి ఇవ్వగా.. ఇప్పటికే 9.88 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. హరితహారం కింద మొక్కలకు గోతులు తవ్వటం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులను ఎక్కువగా చేపడుతుండటంతో ఉపాధి హామీ కింద కేంద్రం ఎంత సొమ్ము ఇచ్చినా ఖర్చుపెట్టగ పరిస్థితి ఇక్కడ నెలకొంది. పలు రాష్ట్రాలు కేంద్రం అనుమతించిన పని దినాల్లో సగం కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రంలో ఇంతవరకు పూర్తైన 9.98 కోట్ల పనిదినాల్లో 61.22 శాతం మహిళలే నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. కేరళలో 88 శాతం పనిదినాలు మహిళకే చెందినవైనా.. అక్కడి మొత్తం పనిదినాలు కేవలం 1.52 కోట్లు మాత్రమే. ఆ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 4.50 కోట్ల పనిదినాల బడ్జెట్‌తో పోలిస్తే.. అక్కడ నిర్వహించినవి చాలా తక్కువ. వీటిలోనే 88 శాతం మహిళలకు చెందినవి. కేంద్రం అనుమతించిన వాటికంటే ఇప్పటికే అధికంగా పను చేపడుతూ తెలంగాణ ప్రత్యేకతను కనబరుస్తోంది. జాతీయ స్థాయిలో మహిళా పనిదినాల సగటు 54 శాతం మాత్రమే. తమిళనాడు 85 శాతం మహిళా భాగస్వామ్యాన్ని కనబరుస్తోంది.
views: 1138

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams