Current Affairs Telugu Daily

డెన్మార్క్‌ ఓపెన్‌ విజేత శ్రీకాంత్‌ 
భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడు. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2017 అక్టోబర్‌ 22న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 8వ సీడ్‌ 37 ఏళ్ల లీ హ్యున్‌ (కొరియా)పై విజయం సాధించాడు. ప్రకాశ్‌ పదుకొనె, సైనా నెహ్వాల్‌ తర్వాత ఈ టైటిల్‌ సాధించిన మూడో భారత క్రీడాకారుడిగా కిదాంబి శ్రీకాంత్‌ రికార్డు నెలకొల్పాడు. ఒక్క ఏడాదిలో మూడు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెల్చుకున్న రెండో భారత ప్లేయర్‌ సైనా సరసన నిలిచాడు. బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఏడాదిలో 4 సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ ఆడిన ఆరో ఆటగాడిగా కూడా 24 ఏళ్ల శ్రీకాంత్‌ ఘనత సాధించాడు.
views: 938

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams