Current Affairs Telugu Daily

భారత సంతతి బాలిక గీతాంజలి రావుకు యువ శాస్త్రవేత్త అవార్డు
అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా గీతాంజలి రావు(11) అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు డిస్కవరీ ఎడ్యుకేషన్‌ త్రీఎం యంగ్‌ సైంటిస్ట్‌ చాలెంజ్‌లో ప్రథమ స్థానం దక్కింది. రెండేళ్ల కింద మిషిగన్‌ ప్రాంతంలోని ఫ్లెంట్‌ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో సీసం కాలుష్యాన్ని గుర్తించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ప్రత్యేకమైన పట్టీతో చేసే పరీక్ష ఒకటి. దీనిద్వారా కాలుష్యం సంగతి వెంటనే తెలిసిపోతుంది. కానీ, కొన్నిసార్లు కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు.  రెండోది ప్రభుత్వ సంస్థకు నీటి నమూనాను పంపి పరీక్షించడం. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గీతాంజలి త్రీఎం శాస్త్రవేత్తతో కసి తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. కార్బన్‌ నానో ట్యూబుతో పనిచేసే ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది నీటిలోని సీసం కాలుష్యాన్ని గుర్తించడంతో పాటు ఆ సమాచారాన్ని బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కు పంపిస్తుంది. 
views: 880

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams