Current Affairs Telugu Daily

అవినీతి కేసులో నవాజ్‌ షరీఫ్‌పై నేరాభియోగం 
పదవీచ్యుతుడైన పాకిస్థాన్‌ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తె, అల్లుడు అవినీతికి పాల్పడ్డారంటూ సంబంధిత న్యాయస్థానం 2017 అక్టోబర్‌ 20న నేరాభియోగం చేసింది. లండన్‌లోని ‘అవెన్‌ఫీల్డ్‌ ప్రాపర్టీస్‌’కు సంబంధించిన అవినీతి కేసులో వీరు ముగ్గురిపైనా కేసులు నమోదయ్యాయి. నవాజ్‌ షరీఫ్‌పై ‘జాతీయ జవాబుదారి బ్యూరో’(ఎన్‌ఏబీ) సెప్టెంబరులో 3 కేసులు నమోదు చేసింది. కాగా, అవెన్‌ఫీల్డ్‌ ప్రాపర్టీస్‌ కేసులో షరీఫ్‌, ఆయన కుమార్తె మర్యాం నవాజ్‌, అల్లుడు  కెప్టెన్‌ (రిటైర్డ్‌)మహమ్మద్‌ సఫ్దర్‌పై సదరు కోర్టు నేరాభియోగం చేసింది. 
views: 857

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams