Current Affairs Telugu Daily

400 నిగూఢమైన రాళ్ల నిర్మాణాలు 
ఈజిప్టు నాగరికత కంటే 2000 ఏళ్లు పురాతనం 
 పశ్చిమ, మధ్య సౌదీఅరేబియాలోని హర్రత్‌ ఖైబర్‌ ఎడారి ప్రాంతంలో నిగూఢమైన 400 రాళ్లతో కూడిన నిర్మాణాలను పురాతత్వశాస్త్రజ్ఞులు కనుగొన్నారు. పక్కనే నిలబడి చూస్తే ఎవరో కావాలనే వరుసగా రాళ్లను పేర్చినట్లు మాత్రమే కనిపిస్తాయి. గూగుల్‌ ఎర్త్‌ను ఉపయోగించి ఓ శాస్త్రవేత్త పరిశోధన చేసినప్పుడే వీటి వెనుక ఉన్న అద్భుతమేమిటో అర్థమైంది. ఈ నిర్మాణాలు ఈజిప్టు పిరమిడ్ల కంటే 2000 ఏళ్లు పురాతనమైనవి, దాదాపు 7000 ఏళ్ల క్రితం నిర్మించినట్లు తేలింది. నొమాడిక్‌ గిరిజన తెగ ప్రజలు వేలాది సంవత్సరాల క్రితం వీటిని నిర్మించారని భావిస్తున్నారు. సౌదీలో వీటిని రాళ్లగేట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ గేట్లు ఒక్కొక్కటి కనిష్ఠంగా 43 అడుగులు, గరిష్ఠంగా 1699 అడుగుల పొడవు ఉన్నాయి. ఇవన్నీ లావా ఎగజిమ్మే ప్రాంతానికి దగ్గరిగా, జంతు, మానవ సంచారం పెద్దగా లేనిచోట్ల నిర్మించడం గమనార్హం.

views: 855

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams