నైపుణ్యాభివృద్ధిపై జపాన్‌-భారత్‌ ఒప్పందం 
సాంకేతిక శిక్షణపై సహకారం అందించుకునే విషయమై భారత్‌- జపాన్‌లు ఒప్పందం చేసుకున్నాయి. దీనికి సాంకేతిక మలి దశ శిక్షణ కార్యక్రమం (టెక్నికల్‌ ఇంటెర్న్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం-TITP) అని పేరు పెట్టారు. ఈ పథకం కింద భారత్‌కు చెందిన సాంకేతిక విద్యార్థులను ఉద్యోగ శిక్షణార్థం జపాన్‌ పంపిస్తారు. 3 నుంచి 5 సం॥ల పాటు శిక్షణ ఇస్తారు. గతేడాది 2.30 లక్షల మంది విదేశీ అభ్యర్థులు జపాన్‌లో శిక్షణ పొందుతున్నారు. అభ్యర్థులు పంపించనున్న దేశాల్లో భారత్‌ మూడోది కానుంది. రానున్న పదేళ్లలో 30 వేల మందికి జపాన్‌ పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు 2017 అక్టోబర్‌ 17న టోక్యోలో జరిగిన సమావేశంలో భారత నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, జపాన్‌ కార్మిక, సంక్షేమ శాఖ మంత్రి కట్సునోబు కాటో మధ్య ఒప్పందం కుదిరింది. 2016లో ప్రధాని మోడి జపాన్‌లో జరిపిన పర్యటన సందర్భంగా తయారీ రంగంలో నైపుణ్యాన్ని మార్చుకోవాలన్న అంగీకారం కుదిరింది.
Technical Intern Training Program (TITP)

views: 764

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams