Current Affairs Telugu Daily

ప్రపంచ ఉక్కు సంఘం కోశాధికారిగా సజ్జన్‌ జిందాల్‌ 
ప్రపంచ ఉక్కు సంఘం (వరల్డ్‌ స్టీల్‌) కోశాధికారిగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌, సభ్యులుగా టాటా స్టీల్‌ ఎండీ టీవీ నరేంద్రన్‌, ఆర్సెలార్‌మిత్తల్‌ అధిపతి లక్ష్మీనివాస్‌ మిత్తల్‌లు ఎన్నికయ్యారు. బ్రసెల్స్‌లో జరిగిన సాధారణ సభ్య సమావేశంలో ఎన్నిక జరిగిందని, ఏడాది పాటు వీరు బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రపంచ ఉక్కు సంఘం తెలిపింది. ఛైర్మన్‌గా నిప్పన్‌ స్టీల్‌, సుమిటోమో మెటల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, అధ్యక్షుడు అయిన కోషి షిండో ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా నుకార్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, సీఈఓ జాన్‌ ఫెరియోలా, పోస్కో సీఈఓ వూజాన్‌ క్వాన్‌లు నియమితులయ్యారు. 16 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక కమిటీని బోర్డు ఎన్నుకుంది.
views: 899

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams