Current Affairs Telugu Daily

రిటైరైన తర్వాతా రైల్వేలో రెండేళ్లు ఉద్యోగం
రైల్వేలో పదవీ విరమణ చేసిన సిబ్బంది సేవల్ని మరో రెండేళ్ల పాటు వినియోగించుకునేందుకు కావాల్సిన అధికారాలను డివిజనల్‌ రైల్వే మేనేజర్లకు రైల్వేబోర్డు కల్పించింది. డీఆర్‌ఎంలు తమ విచక్షణ ప్రకారం పింఛన్‌దారుల్ని తీసుకోవచ్చని 2017 అక్టోబర్‌ 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి. రైల్వే వెబ్‌సైట్లలో తగినంత ప్రచారం కల్పించి వీరిని తీసుకోవచ్చు. ఇలా నియమితులైన వారు తమకు 62 ఏళ్లు నిండేవరకు మాత్రమే కొనసాగడం వీలవుతుంది. ప్రస్తుతం రైల్వే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. అంటే గరిష్టంగా రెండేళ్ల పాటు సేవలు అందించవచ్చు. ఉద్యోగిగా ఉన్నప్పుడు చివరి నెవలలో తీసుకున్న జీతం నుంచి పింఛన్‌ మొత్తాన్ని మినహాయించి, ఇలాంటి వారికి పారితోషికాన్ని నిర్ణయిస్తారు. భద్రతతో ముడిపడిన విభాగాల్లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నవారికి, సరళీకృత పదవీ విమరణ పథకాన్ని ఉపయోగించుకున్నవారికి... ఇలా కొన్ని విభాగాలకు మాత్రం మళ్లీ కొనసాగే అర్హత ఉండదు. తీసుకోబోయేవారి సామర్థ్యం, భద్రతపరమైన రికార్డు, వైద్య ప్రమాణాల వంటివి చూసుకున్నాక పింఛన్‌దారుల్ని ఎంపిక చేస్తారు. రిటైరైన వారిని తీసుకునేందుకు ఉత్తర రైల్వే దాదాపు 4500 ఖాళీ పోస్టుల్ని ప్రకటించింది. 2018 సెప్టెంబరు 14 వరకు ఇల నియామకాలు చేపడతారు. రైల్వే నియామక సంస్థ నుంచి పోటీ పరీక్ష ద్వారా యువ అభ్యర్థుల ఎంపికై రాగానే వీరి సేవల్ని నిలిపివేస్తారు.
views: 921

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams