Current Affairs Telugu Daily

ఆసియా టాప్‌-50 వర్సిటీల్లో 3 భారత వర్సిటీలకు చోటు
ఆసియాలోని అత్యుత్తమ 50 యూనివర్సిటీల జాబితాలో మూడు భారత విద్యాసంస్థలకు స్థానం దక్కింది. క్వాక్‌ క్వాడ్రిల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో ఐఐటీ బాంబే 34వ, ఐఐటీ ఢిల్లీ 41వ, ఐఐటీ మద్రాస్‌ 48వ స్థానంలో నిలిచాయి. సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ మొదటి స్థానంలో (నిరుడు 3వ స్థానం) నిలవగా, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ రెండో స్థానం (గతేడాది మొదటి స్థానం) దక్కించుకుంది. టాప్‌-10 జాబితాలో భారత యూనివర్సిటీలకు చోటు దక్కలేదు. ఆసియాలోని 400కు పైగా వర్సిటీలను పరిశీలించిన క్వాక్‌ క్వాడ్రిల్లీ సైమండ్స్‌ సంస్థ యూనివర్సిటీల్లో అధ్యాపకుల అర్హత (పీహెచ్‌డీ), దేశ, విదేశీ విద్యార్థుల సంఖ్య, అకడమిక్‌ ఫలితాలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాకింగ్‌ నిర్ణయించింది. 
జాబితా
ర్యాంక్‌     యూనివర్సిటీ
1    నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, సింగపూర్‌
2    నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌, సింగపూర్‌
3    హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హాంకాంగ్‌ 
4    కొరియా అడ్వాన్స్‌డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, దక్షిణ కొరియా
5    యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌, హాంకాంగ్‌ 
6    సింఘువా వర్సిటీ, చైనా
7    ఫుడాన్‌ యూనివర్సిటీ, చైనా
8    సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌, హాంకాంగ్‌ 
9    పెకింగ్‌ వర్సిటీ, చైనా
10    ద చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌, హాంకాంగ్‌ 
34    ఐఐటీ బాంబే, ఇండియా
41    ఐఐటీ ఢిల్లీ, ఇండియా
48    ఐఐటీ మద్రాస్‌, ఇండియా
51    ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు, ఇండియా
59    ఐఐటీ కాన్పూర్‌, ఇండియా
72    ఢిల్లీ యూనివర్సిటీ, ఇండియా
93    ఐఐటీ రూర్కీ, ఇండియా
98    ఐఐటీ గౌహతి,ఇండియా

views: 882

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams