ఎన్సీఎల్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డికి ఒప్పి పురస్కారం
పుణెలోని జాతీయ రసాయనిక ప్రయోగశాల(ఎన్సీఎల్) శాస్త్రవేత్త డా॥ శ్రీనివాసరెడ్డికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా(ఒప్పి) శాస్త్రవేత్త పురస్కారం భించింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి.. ఔషధ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2017 సంవత్సరానికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. కెమికల్ సైన్సెస్ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా శ్రీనివాసరెడ్డి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా(నాసి) ఫెలోగా కూడా ఎంపికయ్యారు. శ్రీనివాసరెడ్డి గతంలో ప్రతిష్టాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
views: 866