Current Affairs Telugu Daily

శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించిన కేరళ
హైకోర్టు 
టీమ్‌ ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించాలని కేరళ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. శ్రీశాంత్‌పై నిషేధాన్ని తొలగిస్తూ 2017 ఆగస్టు 7న కేరళ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బీసీసీఐ సవాల్‌ చేయడంతో విచారణ చేపట్టిన.. ప్రధాన న్యాయమూరి జస్టిస్‌ నవనీతి ప్రసాద్‌సింగ్‌, జస్టిస్‌ రాజా విజయ రాఘవన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దీంతో శ్రీశాంత్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. టీమ్‌ఇండియాలో పునరాగమనం చేయాలని, కనీసం క్లబ్‌ క్రికెట్‌ అయినా ఆడాలని శ్రీశాంత్‌ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అభియోగాలపై బోర్డు అతడిపై జీవితకాల నిషేధం విధించింది. 
views: 892



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams