మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు రచించిన ‘దోజ్ ఈవెంట్ ఫుల్ డేస్’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలో 2017 అక్టోబర్ 16న ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో విద్యాసాగర్‌రావు తమిళనాడులో పన్నీర్‌సెల్వం రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు శశికళను ఎందుకు ఆహ్వానించలేదన్న దానిపై ఈ పుస్తకంలో అన్ని వివరాలను పొందుపరిచారు. న్యాయ నిపుణుల సలహాపైనే నాడు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళను ఆహ్వానించలేదని విద్యాసాగర్‌రావు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విషయంలో సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడడానికి రెండు రోజుల ముందు శశికళ అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేతగా ఎన్నికయ్యారని, అదే సమయంలో ప్రమాణస్వీకారం చేయడానికి రాజ్‌భవన్‌ను సంప్రదించారని, రెండు రోజుల్లో తుది తీర్పు రానుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, సుస్థిర ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకోవడంలో తొందరపడలేదని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో జయలలితకు సంబంధించిన అనారోగ్యం, ఆస్పత్రిలో చేరడం, ఆమె మృతి, పన్నీర్‌సెల్వం రాజీనామా, శశికళ ఎన్నిక, తదితర పరిణామాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి వివరించిన అంశాలను పొందుపరిచారు.
views: 1053