దేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో నిర్మించిన ‘అఖిల భారత ఆయుర్వేద సంస్థ’ను ప్రధాని నరేంద్రమోడి 2017 అక్టోబర్ 17న ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ ప్రపంచమంతా మళ్లీ ప్రకృతి వైపు వెళ్తొంది. ఆయుర్వేదం భారత్‌కు బలం. ఈ రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సంబంధిత వ్యక్తులంతా కృషి చేయాలి. అల్లోపతి మాత్ర మాదిరిగా తక్షణం ఉపశమనాన్ని కలిగించే ఆయుర్వేద మందుల్ని నిపుణులు కనిపెట్టాలి. వాటిని వాడడం వల్ల ఎలాంటి ఇతర దుష్ప్రభావాలు ఉండకుండా చూడాలి. ఆయుర్వేద మందుల్ని అధునాతన పద్ధతుల్లో మెరుగైన ప్యాకేజింగ్‌తో తీసుకురావాలి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయుర్వేద వాతావారణాన్ని మనం తీసుకురావాలి’ అని మోదీ చెప్పారు. ఆయుర్వేదాన్ని బలోపేతం చేయడానికి ప్రైవేటు రంగంలోని సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్ని వినియోగించాలని ఆయన కోరారు.
All India Institute of Ayurveda (AIIA)
views: 741