Current Affairs Telugu Daily

అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షుడిగా కేశవులు 
అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షుడిగా డాక్టర్‌ కేశవులు ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ (ఎస్‌సీఏ) సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ విత్తన సంస్థలు, విత్తన పరిశ్రమలను సమన్వయ పరిచేందుకు ఈ సలహా మండలి కొత్తగా ఏర్పడింది. ఇందులో ఇస్టా, ఓఈసీడీ లాంటి అంతర్జాతీయ విత్తన సంస్థ ప్రతినిధుతో పాటు 8 మంది సభ్యులుంటారు. విత్తన పరిశ్రమ అవసరాలు, పరిశోధనా అంశాలు, విత్తన నాణ్యత, ఎగుమతులు, దిగుమతులకు నిబంధన రూపకల్పన తదితర అంశాల్లో ఈ సలహా మండలి కీలక పాత్ర పోషించనుంది. 
views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams