Current Affairs Telugu Daily

టి.ఎం.కృష్ణకు ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణకు ప్రతిష్టాత్మక ‘ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా పురస్కారం’ లభించింది. 2015-16 సంవత్సరానికిగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజైన అక్టోబరు 31న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ టి.ఎం.కృష్ణకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద ఆయనకు రూ.పది లక్షల నగదు, ప్రశంసాపత్రం లభిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మక రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత అయిన కృష్ణ కులాల అంతరాలను రూపుమాపేందుకు సంగీతం ద్వారా కృషి చేశారు. మహిళల హక్కులు, చిన్నారుల అవసరాలు తదితర సామాజిక రాజకీయ అంశాలపై విస్తృతంగా రాశారు. కాలమిస్టుగా ఆయన ఈ దిశగా విశేష కృషి చేశారు.
views: 981

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams