Current Affairs Telugu Daily

దివ్యాంగులకు ప్రయాణం సులభం
ఎయిర్‌పోర్టుల్లో దివ్యాంగులకు భద్రతాపరమైన తనిఖీల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర పారామిలిటరీ విభాగం సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌ పోర్టులో భద్రతాపరమైన తనిఖీ కోసం దివ్యాంగులను వీల్‌చైర్‌ నుంచి లేపడం, వారి కృత్రిమ అవయవాలను తీసేయాలని ఇకపై అడగకూడదని సీఐఎస్‌ఎఫ్‌ నిర్ణయించింది. దివ్యాంగులకు విమాన ప్రయాణం సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ తెలిపారు. 
views: 824

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams