Current Affairs Telugu Daily

టైమ్‌ ‘తదుపరి తరం నాయకుల’ జాబితాలో గుర్‌మెహర్‌ కౌర్‌కు చోటు 
దేశ రాజధానిలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని గుర్‌మెహర్‌ కౌర్‌ను టైమ్‌ మ్యాగజైన్‌ ‘తదుపరి తరం నాయకులు-2017’ జాబితాలో చేర్చింది. జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన భారత సైనిక కెప్టెన్‌ కుమార్తె గుర్‌మెహర్‌ ఈ జాబితాలో ఏకైక భారతీయురాలు. 2017 ఫిబ్రవరిలో ఢిల్లీలోని రామ్‌జాస్‌ కళాశాల ప్రాంగణంలో ఓ విద్యార్థి సంఘం ప్రమేయంతో తలెత్తిన హింసను నిరసిస్తూ సహ విద్యార్థుతో కలిసి కౌర్‌ గళమెత్తారు. తాను ఒంటరిని కానని.. ఆ సంఘానికి భయపడేది లేదని పేర్కొంటూ ప్లకార్డు పట్టుకున్న చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. భారత్‌, పాక్‌ మధ్య శాంతి నెలకొనాలంటూ ఇంటర్నెట్‌ ప్రచారంపై మరో చిత్రాన్ని కూడా ఉంచారు.
views: 871

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams