Current Affairs Telugu Daily

‘భారత ప్రపంచ కవితోత్సవం-2017’ 
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో 2017 అక్టోబర్‌ 13 నుంచి 15 వరకు ‘భారత ప్రపంచ కవితోత్సవం-2017’ నిర్వహించారు.  ప్రజల్లో చైతన్యం కల్పించడం, మానవత్వాన్ని తట్టిలేపడమే లక్ష్యంగా వరంగల్‌కు చెందిన సాహితీ సంస్థ ‘సృజనలోకం’ (రైటర్స్‌ కార్నర్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రసిద్ధ కవుల వేదిక పెంటాసీబీ సహకారం అందించింది. 35 దేశాలకు చెందిన 35 మంది కవులతోపాటు సాహితీవేత్తలు, విద్యావేత్తలు.. భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి 30 మంది కవుల, పలువురు తెలుగు రచయితలు హాజరయ్యారు. 
views: 900



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams