కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
- కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాయాలు, ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులకు వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది. వీరికి ఏడో వేతన సంఘం సిఫార్సును వర్తింపజేసింది. పెరుగుదల రూ.10,400 నుంచి రూ.49,800 మధ్య (22 శాతం నుంచి 28 శాతం మేర) ఉంటుంది. 2016 జనవరి 1నుంచి అమలయ్యేలా ఉత్తర్వులు ఇస్తారు. యూజీసీ/మానవ వనరుల శాఖ నిధు అందిస్తున్న 106 విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్న 329 విశ్వవిద్యాలయాలు, 12,912 ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలు, 119 ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఈ కారణంగా కేంద్రపై రూ.1,400 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాపై రూ.8,400 కోట్లు భారం పడనుంది.
- ప్రపంచ బ్యాంకు సహాయంతో చేపట్టనున్న 2 నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు ఆమోదం. జీవనోపాధి ఉన్నతికి నైపుణ్య సముపార్జన, జ్ఞాన అవగాహన (స్కిల్స్‌ అక్విజిషన్‌ అండ్‌ నాలెడ్జ్‌ అవేర్‌సెన్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ ప్రమోషన్‌-సంకల్ప్‌), పారిశ్రామిక విలువ పురోగతికి నైపుణ్య సమృద్ధి (స్కిల్‌ స్ట్రెంథనింగ్‌ ఫర్‌ ఇండిస్ట్రియల్‌ వ్యల్యూ ఎన్‌హాన్స్‌మెంట్‌-స్ట్రైవ్‌) అనే పథకాలు అమల్లోకి రానున్నాయి. సంకల్ప్‌కు రూ.4,455 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.3,300 కోట్లను ప్రపంచబ్యాంకు రుణంగా ఇవ్వనుంది. స్ట్రైవ్‌కు రూ.2,200 కోట్లు కేటాయించగా, ఇందులో సగం ప్రపంచ బ్యాంకు రుణంగా ఉంటుంది. ఇందులో భాగంగా 66కు పైగా ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తయారీ రంగం సహా, ఇతర అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు బెలారస్‌తో కుదిరిన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం
- నౌకాయాన, లైట్‌హౌస్‌ సంస్థలకు నౌకా సంబంధ పరికరాలు అందించే అంతర్జాతీయ సంఘం (ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెరైన్‌ ఎయిడ్స్‌ టు నావిగేషన్‌ అండ్‌ లెట్‌ హౌస్‌ అథారిటీస్‌-ఐఏఎల్‌ఏ) హోదాను మార్చుతూ నిర్ణయం. ఇంతవరకు దీనికి ప్రభుత్వేతర సంస్థ అన్న హోదా ఉండగా, ఇకపై అంతర్‌ ప్రభుత్వ సంస్థ హోదా దక్కనుంది.

views: 828

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams