సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ 115వ జయంతి, సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతిని 2017 అక్టోబర్ 11న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి ‘దిశ’ పోర్టల్‌ను ప్రారంభించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో అమలవుతున్న పలు పథకాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, పనులను పర్యవేక్షించేందుకు ఈ పోర్టల్ ఉపకరిస్తుంది.
views: 695