పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా ఆర్‌.కె.గుప్తా
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా ఆర్‌.కె.గుప్తా
పోలవరం ప్రాజెక్టు అథార్టీ సభ్య కార్యదర్శిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ శ్రీవాత్సవ అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఈయనను తప్పించి ఆర్‌.కె.గుప్తాను నియమించింది. ఆర్‌.కె.గుప్తా ఇప్పటివరకు హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం ఛైర్మన్‌గా ఉన్నారు. తుంగభద్ర బోర్డు కార్యదర్శిగా ఉన్న డి.రంగారెడ్డిని హైదరాబాద్‌లోని కృష్ణా, గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌(కెజిబిఓ) చీఫ్‌ ఇంజినీర్‌గా నియమించారు. కెజిబిఓ చీఫ్‌ ఇంజినీర్‌ తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో చీఫ్‌ ఇంజినీర్‌గా హెచ్‌.మీనాను నియమించారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ 2017 అక్టోబర్‌ 11న ఆదేశాలు జారీ చేసింది.
views: 95
Vyoma Current Affairs
e-Magazine
Monthly Wise
FREE Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.