హరిత రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ 
స్వచ్ఛ భారత్‌ అమలులో 2వ స్థానంలో కొనసాగుతున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దేశంలోనే ‘హరిత రైల్వే స్టేషన్‌’గా నిలిచింది. జైపూర్‌లో జరిగిన ‘గ్రీన్‌బిల్డింగ్‌ కాంగ్రెస్‌-2017’లో భాగంగా 2017 అక్టోబర్‌ 5న దక్షిణమధ్య రైల్వే ఈ అవార్డును అందుకుంది. భారత హరిత భవనం మండలి- భారత పరిశ్రమ సమాఖ్య (ఐజీబీసీ-సీఐఐ) సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు స్విర్‌ రేటింగ్‌ ఇచ్చింది. మూడేళ్ల కాల పరిమితి ఉన్న ఈ అవార్డును సికింద్రాబాద్‌ డివిజన్‌ ఉన్నతాధికారులకు ప్రదానం చేశారు. 
- సుమారు 13.34 ఎకరాల్లో విస్తరించిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మొత్తం 408 రకాల చెట్లు ఉన్నాయి. 
- స్థానికంగా తయారుచేసిన సేంద్రియ ఎరువులనే ప్రాంగణంలోని మొక్కలకు, పార్కుల్లో వినియోగిస్తున్నారు. 
- స్టేషన్‌ ఆవరణలో సౌర విద్యుత్‌ ఫలకల అమరిక ద్వారా.. నిత్యం 2500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో 37 శాతం స్టేషన్‌ ఇంధన అవసరాలు తీరడమే కాకుండా ఏడాదికి రూ. 72.92 లక్షలు ఆదా చేస్తున్నారు. 
- సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 100 శాతం ఎల్‌ఈడీ దీపాలను వాడుతున్నారు.

views: 745

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams