గోప్యత ధర్మాసనానికి అవార్డు
వ్యక్తిగత వివరాల గోప్యత పౌరుల ప్రాథమిక హక్కేనంటూ 2017 ఆగస్టులో తీర్పువెలువరించిన ధర్మాసనానికి అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పౌరుల హక్కుల కోసం కృషి చేసేవారికి యాక్స్రెస్‌ నౌ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఈ అవార్డులిస్తుంది. డిజిటల్‌ ప్రపంచంలో మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ విధానాలను తన తీర్పులో ప్రస్తావించినందుకు ధర్మాసనంలోని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌కు ఆ సంస్థ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. గోప్యత ప్రాథమిక హక్కంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నారిమన్‌తో పాటు జస్టిస్‌ బాట్టే, జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ అగర్వాల్‌, జస్టిస్‌ సప్రే, జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ జస్టిస్‌ కౌల్‌, జస్టిస్‌ నజీర్‌ సభ్యులుగా ఉన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న 5 సంస్థలు లేదా వ్యక్తులను యాక్సెస్‌ నౌ హీరోలుగా పేర్కొంటూ ఈ పురస్కారాలు ఇస్తుంది. అలాగే మానవ హక్కులకు భంగం కలిగిస్తున్న ఐదుగురికి విన్‌ అవార్డు కూడా ఇస్తుంది. ఈ ఏడాది విన్‌ జాబితాలో అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షలు డొనాల్డ్‌ ట్రంప్‌, మేక్రాన్లను చేర్చింది.
views: 725
Current Affairs Telugu
e-Magazine
March-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams