Current Affairs Telugu Daily

తెలంగాణ IoT విధానం విడుదల 
రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని (ఐటీ) మరింతగా ప్రోత్సహించే వ్యూహంలో భాగంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT) విభాగానికి ప్రత్యేక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు ఇ-వేస్ట్‌ నిర్వహణ విధానాన్ని కూడా విడుద చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ విధానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై చర్చించడానికి ‘ఐ-తెలంగాణ 2017’ పేరుతో ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) 2017 అక్టోబర్‌ 10న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ రెండు విధానాలను ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. వచ్చే అయిదేళ్లలో ఐఓటీ రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 50 వేల మందికి నేరుగా ఉద్యోగావకాశాలు కల్పించాన్నది విధాన లక్ష్యం. రెండేళ్ల క్రితం ఐటీ రంగానికి ప్రత్యేక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంలో ఐటీ రంగంలోని ప్రత్యేక విభాగాలకు 10 ప్రత్యేక విధానాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. తాజాగా ఐఓటీ, ఇ-వేస్ట్‌ నిర్వహణకు విధానాలను ప్రకటించడంతో మొత్తం 10 విధానాలను ప్రకటించినట్లయింది. ఐ-తెలంగాణ సందర్భంగా ఇ-వేస్ట్‌ నిర్వహణ, ఇతర అంశాలపై వివిధ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని టి-హబ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హగ్‌ ఇన్నోవేషన్స్‌ అభివృద్ధి చేసిన ఐఓటీ ఆధారిత తొలి ఫిట్‌నెస్‌ పరికరం-కదలికను నియంత్రించే వాచీ- ‘హెగ్‌ ఎన్‌’ను కేటీఆర్‌ విడుదల చేశారు. దీనిధర రూ.4,999.
- ఫిక్కీ సెక్రటరీ జనరల్‌ : సంజయ్‌ బారు 
ఐఓటీ విధానం 
- ఐఓటీ రంగంలో ప్రత్యేక వ్యాపారాు, తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం. 
- హైదరాబాద్‌, వరంగల్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఐఓటీ కోసం 5 ప్రత్యేక జోన్లు ఏర్పాటు 
- నిధుల సమీకరణలో స్టార్టప్‌కు మద్దతు 
- ఐఓటీ రంగంలో ‘రెడీ-టు-ఎంప్లాయ్‌’ నిపుణులను తయారు చేయడం. 
- కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్య ఒప్పందాలు
- ఐఓటీ విభాగంలో స్మార్ట్‌ సిటీ సొల్యూషన్లు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, స్మార్ట్‌ లాజిస్టిక్స్‌, వ్యవసాయ ఉత్పత్తులు అభివృద్ధిపై దృష్టి. 
- హార్డ్‌వేర్‌ ప్రోటోటైప్‌ కేంద్రం టి-వర్క్స్‌ ఏర్పాటు
ఇ-వేస్ట్‌ నిర్వహణ విధానం 
- ఇ-వేస్ట్‌ నిర్వహణపై సమాజంలో అవగాహన కల్పించడం. 
- రాష్ట్రంలో రీసైక్లింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం 
- రానున్న పారిశ్రామిక పార్కుల్లో ఇ-వేస్ట్‌ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడం. 
- మరిన్ని ఇ-వేస్ట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడం. అటువంటి యూనిట్లకు ఆర్థిక సాయం చేయడం. 
- కనీసం రూ.5 కోట్లతో రీసైక్లింగ్‌ యూనిట్లు పెట్టే మొదటి అయిదుగురికి రూ.కోటి సబ్సిడీ. శిక్షణ తదితరాలకు సబ్సిడీలు. 
IoT- Internet of Things
FICCI- Federation of Indian Chambers of Commerce and Industry  

views: 960

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams