Current Affairs Telugu Daily

ఎన్జీవోల విదేశీ విరాళాలకు దర్పణ్‌లో నమోదు తప్పనిసరి
విదేశీ విరాళాలను పొందుతున్న అన్ని స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) తప్పనిసరిగా నీతిఆయోగ్‌కు చెందిన ‘దర్పణ్‌’ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అవి మరింత పారదర్శకంగా, సమర్ధంగా, జవాబుదారీతనంతో పనిచేసేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA) కింద నమోదైన ప్రతి సంస్థకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. 
- స్వచ్ఛంద సంస్థలు దర్పణ్‌లో నమోదు చేసుకోగానే ఒక సార్వత్రిక గుర్తింపు(ఐడీ) సంఖ్యను కేటాయిస్తుంది. 
- ఇందుకుగాను సంస్థ పాన్‌, ఈ-మెయిల్‌, సెల్‌ నంబరు, ప్రధాన నిర్వాహకుల పేర్లు తదితర వివరాలను పోర్టల్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. 
- నమోదు ప్రక్రియ ఉచితంగానే చేసుకోవచ్చు. 
- ఇకపై దర్పణ్‌ గుర్తింపు సంఖ్య ఉంటేనే ఎఫ్‌సీఆర్‌ఏ సంబంధిత సేవలను ఆయా సంస్థలు పొందగలుగుతాయని హోంశాఖ స్పష్టం చేసింది.
FCRA-Foreign Contribution (regulation) Act

views: 1008



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams