Current Affairs Telugu Daily

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెల్లెలికి ప్రమోషన్‌ 
ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పార్టీ కీలక పదవిలో తన సోదరిని నియమించారు. కిమ్‌ యో జోంగ్‌ను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించినట్లు ప్రభుత్వ అధికార వార్తాసంస్థ కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది. 2017 అక్టోబర్‌ 8న కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నేతృత్వంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమంపై కూడా కిమ్‌ ప్రశంసలు కురిపించారు. 
- కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పార్టీ పేరు : వర్కర్స్‌ పార్టీ

views: 854



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams