చిత్తూరు జిల్లా తిరుపతి కళాకారులు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. చరిత్రాత్మక ‘అహో ఆంధ్రభోజ’ పద్యనాటకాన్ని తిరుపతి మహతి కళాక్షేత్రంలో 120 మంది కళాకారులతో ప్రదర్శించారు. సుబ్బరాజు నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నాటకం 2017 అక్టోబర్ 8న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై నిరాటంకంగా 4.20 గంటల పాటు సాగింది.
views: 1130