Current Affairs Telugu Daily

చత్తర్‌ మంజిల్‌ రాజకోట రహస్యం బట్టబయలు 
19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత చత్తర్‌ మంజిల్‌ రాజభవనంలోని నేలమాళిగలో మరో రహస్య అంతస్తు బయటపడింది. గోమతి నదికి ఆనుకుని ఉన్న ఈ అంతస్తులోకి స్పష్టంగా సూర్యకాంతి వస్తోంది. ఆహ్లాదకరంగా గాలి వీస్తోంది. నవాబ్‌ సాదత్‌ అలీఖాన్‌ తన తల్లి చత్తర్‌ కున్వర్‌ జ్ఞాపకార్ధం పురాతనమైన ఈ భవంతి నిర్మాణాన్ని ఆరంభించారు. ఆయన తరువాత అతని మూడో కుమారుడు 1810లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఉద్యమం సమయంలో బ్రిటిషువారు దీన్ని ధ్వంసం చేశారు. తాజాగా రూ.8 కోట్లతో పునఃనిర్మాణ పనులు చేపట్టారు. కూలీలు శుభ్రం చేస్తుండగా మూడు, నాలుగు మీటర్ల లోతున రహస్య అంతస్తు బయటపడింది. అత్యవసర పరిస్థితుల్లో తలదాచుకోవడానికి రాజకుటుంబం కోసం దీన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ భవనం నుంచి లక్నోలోకి చేరడానికి 27 రహస్య మార్గాలు ఉన్నాయి.
views: 966Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams