Current Affairs Telugu Daily

స్కల్‌ అధ్యక్షురాలిగా సుసన్న సారి 
ప్రపంచ యాత్రా పర్యాటక సంఘం (ఎస్‌కేఏఎల్‌-స్కల్‌) కొత్త అధ్యక్షురాలిగా సుసన్న సారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ‘స్కల్‌’ ప్రపంచ సదస్సులో 2017 అక్టోబర్‌ 9న ఈ ఎన్నిక జరిగింది. 86 దేశాల నుంచి వచ్చిన 600 మంది ప్రతినిధు సుసన్నను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. 
- ప్రపంచంలో అతి పెద్ద ట్రావెల్‌ సంస్థ అయిన స్కల్‌ 1934లో ఏర్పడింది. 
- స్కల్‌ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాత్రా పర్యాటక సంస్థలకు సభ్యత్వం ఉంది. 
- 87 దేశాలకు చెందిన 17000 మంది ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా 382 స్కల్‌ చార్టర్‌ క్లబ్బులతో ఈ సంఘం విస్తరించి ఉంది. 

views: 911



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams