Current Affairs Telugu Daily

విద్యుత్‌ ఉత్పత్తిలో సింగరేణి విద్యుత్‌ కేంద్రానికి 8వ స్థానం 
విద్యుదుత్పత్తిలో సింగరేణి విద్యుత్‌ కేంద్రం దేశంలో 8వ స్థానంలో నిలిచింది. ఒక విద్యుదుత్పత్తి సంస్థ పూర్తి విద్యుదుత్పత్తి సామర్థ్యంలో ఎంత వరకు ఉత్పత్తి చేస్తుందనే అంశాన్ని ‘ప్లాంటు లోడ్‌ ఫ్యాక్టర్‌’(పీఎల్‌ఎఫ్‌) అని పిలుస్తారు. సింగరేణి ప్లాంటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 86.87 పీఎల్‌ఎఫ్‌తో 8వ స్థానంలో నిలిచింది. పశ్చిమ్‌ బంగ రాష్ట్రంలోని 750 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న బుడ్గే విద్యుత్కేంద్రం 99.77 శాతం పీఎల్‌ఎఫ్‌తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం తొలి 25 స్థానాల్లో నిలిచిన కేంద్రాల వివరాలనే ప్రకటించారు. ఇందులో తెలంగాణలోని సింగరేణి ప్లాంటు 8వ స్థానంలో, రామగుండంలోని సూపర్‌ థర్మల్‌ విద్యుత్కేంద్రం 82.04 శాతంతో 19వ స్థానంలో నిలిచాయి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జెన్‌కో ప్లాంట్లు ఈ జాబితాలో లేవు. 
views: 935

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams