Current Affairs Telugu Daily

రైల్వేలో వీఐపీ సంస్కృతి రద్దు
రైల్వే అధికారులు విలాసవంతమైన ప్రత్యేక రైలుపెట్టెలో ప్రయాణాలు చేసే బదులు సాధారణ ప్రయాణికులతో కలిసి స్లీపర్‌ తరగతిలోనో, లేదంటే తృతీయ శ్రేణి ఏసీలోనో ప్రయాణిస్తూ వారి కష్టనష్టాలను తెలుసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ ఆదేశాలు జారీ చేశారు. రైల్వేబోర్డు సభ్యులు, జనరల్‌ మేనేజర్లు, డివిజనల్‌ రైల్వే మేనేజర్లకు ఇది వర్తిస్తుంది. ఇంట్లో, ఆఫీసులో వీఐపీ సంస్కృతికి పూర్తిగా చరమగీతం పాడాలని స్పష్టం చేశారు. ఈ రెండింట్లో ఎక్కడ్కెనా పుష్పగుచ్ఛాలు, బహుమతులు స్వీకరించవద్దని చెప్పారు. రైల్వే బోర్డు ఛైర్మన్‌ గానీ, సభ్యులు గానీ రైల్వే జోన్ల పర్యటనకు వెళ్లినప్పుడు, తిరిగి బయల్దేరేటప్పుడు సంబంధిత జనరల్‌ మేనేజర్‌ తప్పనిసరిగా హాజరు కావాలంటూ 36 ఏళ్లుగా అమలు చేస్తున్న నిబంధనను రద్దు చేశారు. 1981 నాటి ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ 2017 సెప్టెంబర్‌ 28న రైల్వే మంత్రిత్వశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇలాంటి సందర్భాల్లో రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు అదేవిధంగా రైల్వే అధికారులు తమ ఇళ్లల్లో సొంత పనుల కోసం వాడుకుంటున్న ట్రాక్‌మెన్‌(గ్యాంగ్‌మెన్‌)ను వెంటనే వారివారి అసలు విధులకు పంపించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. 
views: 951



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams