Current Affairs Telugu Daily

పోస్టాఫీసుల్లోనూ ఆధార్‌ తప్పనిసరి
ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, మొబైల్‌ ఫోన్‌ నంబర్లు ఇతరత్రా అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు పోస్టాఫీస్‌కూ దీన్ని వర్తింపజేసింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) ఖాతాలతో పాటు పోస్టాఫీసుల్లోని అన్ని రకా డిపాజిట్‌ పథకాలు, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్‌ వికాస్‌ పత్రాలకు కూడా ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఖాతాదారులు ఇకపై ఆయా పథకాలు, డిపాజిట్‌ దరఖాస్తులకు ఆధార్‌ను జతచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 29న జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అదేవిధంగా ఇప్పటిదాకా పోస్టాఫీస్‌ పథకాలకు సంబంధించి ఆధార్‌ను తమ దరఖాస్తుల్లో వెల్లడించని ప్రస్తుత డిపాజిటర్లకు ఆధార్‌ కాపీని సమర్పించేందుకు 2017 డిసెంబర్‌ 31 వరకూ గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams