Current Affairs Telugu Daily

ప్రతినెలా చివరి శనివారం స్వచ్ఛ పాఠశాల
స్వచ్ఛ తెలంగాణ సాధనకు ప్రతినెలా చివరి శనివారం స్వచ్ఛ పాఠశాల- స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌, ఇతర అధికారులతో స్వచ్ఛ పాఠశాల, పిల్లల హక్కులు- భద్రతపై సమీక్షించారు. ప్రతినెలా చివరి శనివారం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు స్వచ్ఛ పాఠశాలలో భాగంగా విద్యార్థుల్లో పరిశుభద్రత, ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, పాఠశాల నీటి ట్యాంకులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 11న పిల్లల హక్కులు...భద్రతపై పాఠశాలల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
views: 1137

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams