Current Affairs Telugu Daily

హెచ్‌-1బీ ప్రీమియం పునఃప్రారంభం
అన్ని రంగాలకు సంబంధించిన హెచ్‌-1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్‌ (అధిక రుసుము తీసుకుని దరఖాస్తును వేగంగా పరిష్కరించడం)ను అమెరికా 2017 అక్టోబర్‌ 3న పునఃప్రారంభించింది. ప్రీమియం ప్రాసెసింగ్‌కు దరఖాస్తు ఎక్కువగా వస్తుండటంతో 2017 ఏప్రిల్‌లో అమెరికా ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 2017 సెప్టెంబర్‌లో కొన్ని రంగాల్లోని వీసాలకు మాత్రమే ప్రీమియం ప్రాసెసింగ్‌ను అనుమతించిన అమెరికా తాజాగా అన్ని రకాల హెచ్‌-1బీ వీసాలకు ఈ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. 
- ప్రీమియం ప్రాసెసింగ్‌ కింద వచ్చిన హెచ్‌-1బీ దరఖాస్తును అమెరికా 15 రోజుల్లో పరిష్కరిస్తుంది.
- ఆలస్యమైతే దరఖాస్తుదారుడు సాధారణం కన్నా అధికంగా చెల్లించిన డబ్బును వెనక్కు ఇస్తుంది. 
- కొన్ని ప్రత్యేక, సాంకేతిక నిపుణత అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలను అనుమతించేదే హెచ్‌-1బీ వీసా. 
- భారత ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ వీసాలపైనే అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్తుంటారు. 
- ఏడాదికి 65 వేల హెచ్‌-1బీ వీసాలను విదేశీయులకు, మరో 20 వే హెచ్‌-1బీ వీసాలను అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఇతర దేశాల వారికి ఇవ్వాలనేది అమెరికా కాంగ్రెస్‌ నిబంధన. 
-  హెచ్‌-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తూ అమెరికా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం ఈ విధానాన్ని సమీక్షిస్తున్నారు. 

views: 1017



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams