భారత వుషు క్రీడాకారిణి పూజ కడియన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వుషు ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మహిళ 75 కేజీ ఫైనల్లో స్టెఫనోవా (రష్యా)పై పూజ విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం రావడం భారత్కు ఇదే ప్రథమం.
views: 1097