Current Affairs Telugu Daily

SBI నూతన ఛైర్మన్‌గా రజనీశ్‌ కుమార్‌ 
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) ఛైర్మన్‌గా రజనీశ్‌ కుమార్‌ (59) నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య మూడేళ్ల పదవీకాలం గతేడాది ముగిసినా, ఏడాది పొడిగింపు ఇవ్వడంతో కొనసాగుతున్నారు. 2017 అక్టోబర్‌ 6న ఆ గడువు కూడా పూర్తవుతున్నందున, కొత్త ఛైర్మన్‌గా రజనీశ్‌ను నియమించినట్లు మానవ వనరులు, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. ఈ నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది. 
- అరుంధతీ భట్టాచార్య SBIకి తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించింది 
SBI-State Bank of India
- SBI ప్రధాన కార్యాలయం : ముంబై
- SBI స్థాపన : 1955 జులై 1

views: 1104



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams