Current Affairs Telugu Daily

TSRTCకి 3 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు 
తెలంగాణలో డ్రైవర్లు, మెకానిక్‌ కొరతకు పరిష్కారం లభించనుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుపై జారీ చేసిన ప్రకటన మేరకు తెలంగాణ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా 3 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (స్కిల్‌ డెవప్‌మెంట్‌ సెంటర్స్‌) మంజూరయ్యాయి. హైదరాబాద్‌ శివారు హకీంపేట, వరంగల్‌లోని ప్రాంతీయ సిబ్బంది శిక్షణా కేంద్రాలు , హైదరాబాద్‌లోని రవాణా అకాడమీలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేశారు. వీటిలో చోదకులకు, మెకానిక్‌లకు రెండు నుంచి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఇందుకు ఎంపికైన నిరుద్యోగులకు కేంద్రం స్కార్‌షిప్‌ మంజూరు చేస్తుంది. 
TSRTC-Telangana State Road Transport Corporation

views: 1127

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams