Current Affairs Telugu Daily

పెదపారుపూడి సర్పంచికి స్వచ్ఛత పురస్కారం 
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామ సర్పంచి జి.శ్రీలక్ష్మి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు ఎంపికయ్యారు. 2017 అక్టోబర్‌ 1న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. పెదపారుపూడి గ్రామాన్ని రామోజీ ఫౌండేషన్‌ దత్తత తీసుకుని అభివృద్ధి పనులు  చేపట్టింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడంతో పాటు ఘనవ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల నుంచి ఎరువు తయారీ వంటి వాటిలో గ్రామం ముందంజలో ఉండేలా చేయగలిగింది. 
views: 1201

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams