Current Affairs Telugu Daily

ఘనంగా గాంధీ, శాస్త్రిల జయంతి
2017 అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రిల స్మారక ప్రాంతాలైన రాజ్‌ఘాట్‌, విజయ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ గుజరాత్‌లోని మహాత్మాగాంధీ జన్మస్థలం పోరుబందర్‌ను సందర్శించి జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. గ్రామీణ గుజరాత్‌ను ‘బహిరంగ మల విసర్జన రహిత’(ఓడీఎఫ్‌) ప్రాంతంగా ప్రకటించారు. గుజరాత్‌లోని 3,300 గ్రామపంచాయతీలకు ఉద్దేశించిన గ్రామ సమగ్ర పరిశుభ్రతా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. ఘనవ్యర్ధాల నిర్వహణ పథకాన్ని కూడా ప్రారంభించారు. 
views: 986

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams