Current Affairs Telugu Daily

జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ 
ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గీకరణను పరిశీలించి, అత్యంత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ లబ్ధి కలిగేలా చూసేందుకు ఉద్దేశించిన కమిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 అక్టోబర్‌ 2న నియమించారు. అయిదుగురు సభ్యులుండే ఈ కమిషన్‌కు తెలుగు బిడ్డ, ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.రోహిణి నేతృత్వం వహిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి దీనికి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. బాగా వెనుకబడిన ఓబీసీకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయోజనాలు లభించేందుకు వర్గీకరణ దోహదపడుతుందని కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ పేర్కొంది. ఓబీసీ కులాల్లో రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందుతున్న తీరులో అసమానతలు, వారి శాస్త్రీయ వర్గీకరణకు ప్రాతిపదిక/ విధివిధానాలు/ అవసరమైన యంత్రాంగం గురించి కమిషన్‌ పరిశీలిస్తుంది. ఏయే కులాలను, లేదా ఉప కులాలను ఏ విధంగా వర్గీకరించవచ్చో గుర్తిస్తుంది. ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 12 వారాల్లో కమిషన్‌ తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్‌ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి మార్గాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
- జస్టిస్‌ రోహిణి 2001లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
- ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగానూ సేవలందించి 2017 ఏప్రిల్‌ 13న పదవీ విరమణ చేశారు.

views: 1027

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams