Current Affairs Telugu Daily

యూకే సాహిత్య పురస్కారం బరిలో భారత సంతతి రచయితలు
 బ్రిటన్‌కు చెందిన వార్షిక దక్షిణాసియా సాహిత్య పురస్కారం బరిలో నలుగురు భారత సంతతి రచయితలు పోటీ పడుతున్నారు. బుకర్‌ పురస్కార గ్రహీత అరవింద్‌ అడిగ రాసిన తాజా నవల ‘సెలక్షన్‌ డే’ తుదిజాబితాకు ఎంపికైంది. క్రికెట్‌ కథాంశంగా నవల సాగుతుందని తెలుస్తోంది. ముంబయిలో జన్మించిన అంజలి జోసెఫ్‌, కొలంబోలో పుట్టిన అనుక్‌ అరుద్‌ప్రగసమ్‌, టెక్సాస్‌కు చెందిన భారత సంతతి రచయిత కరణ్‌మహాజన్‌, భారతీయ అమెరికన్‌ వ్యక్తి స్టీఫెన్‌ అల్టర్‌ పురస్కారం కోసం పోటీలో ఉన్నారు. తుదిజాబితాకు ఎంపికైన ఐదుగురు అద్భుత నైపుణ్యాన్ని కనబరిచినట్లు జ్యూరీకి చెందిన రీతు మెనన్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 18న బంగ్లాదేశ్‌లో నిర్వహించే ఢాకా సాహిత్య ఉత్సవంలో విజేతను ప్రకటిస్తారు.
views: 1502

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams