Current Affairs Telugu Daily

ఓటరు రికార్డుల్లో మహిళగా ట్రంప్‌ అల్లుడి పేరు నమోదు 
ఓటరు రికార్డుల్లో ట్రంప్‌ అల్లుడు జేరెడ్‌ కుష్నర్‌ పేరు ఓ మహిళగా నమోదైఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలతో ప్రముఖ మ్యాగజైన్‌ ఓ కథనం ప్రచురిచింది. ట్రంప్‌ కుమార్తె ఇవాంకా భర్తయిన కుష్నర్‌... అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రికార్డుల్లోని ఆయన వివరాల్లో తప్పులు దొర్లడం ఇదేమీ తొలిసారి కాదు. శ్వేతసౌధ భద్రతా అనుమతులకు సంబంధించిన పత్రాల్లోనూ ఇలానే జరిగింది. ఈ పత్రాలను ఆయన రెండు మూడుసార్లు సమర్పించాల్సి వచ్చింది. 2009కి ముందు న్యూజెర్సీలోని ఓటు హక్కు నమోదు వివరాల్లో ఆడ/మగ అని ఉన్నచోట ‘తెలియదు’ అని పేర్కొన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. న్యూయార్క్‌కు వచ్చేసరికి ‘ఆడ’అని పొందుపరిచినట్లు వెల్లడించింది.
views: 1550

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams