Current Affairs Telugu Daily

ప్లేబాయ్‌ మేగజీన్‌ వ్యవస్థాపకుడు హ్యూ హాఫ్నర్‌ కన్నుమూత 
వివాదాస్పద, సంచలనాత్మక అమెరికన్‌ మేగజీన్‌ ‘ప్లేబాయ్‌’ వ్యవస్థాపకుడు హ్యూ హాఫ్నర్‌ మృతి చెందారు. 91 ఏళ్ల హాఫ్నర్‌ చనిపోయే వరకూ సంపూర్ణ రోగ్యంగానే ఉన్నారని, వృద్ధాప్య కారణాలతోనే చనిపోయారని ప్లేబాయ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ 28న ప్రకటించింది. హాఫ్నర్‌ 1953లో ప్రారంభించిన ప్లేబాయ్‌ మాస పత్రికను పలు దేశాలు నిషేధించాయి. పురుషులకు ఉద్దేశించిన ఈ పత్రికలో సినీతారల నగ్న చిత్రాలను, ఇంటర్వ్యూలను ప్రచురించారు. 1994 నుంచి ఆన్‌లైన్‌లోనూ ఈ పత్రికను అందుబాటులోకి తెచ్చారు. ఆదరణతో పాటు వివాదాలూ చుట్టుముట్టాయి. న్యాయస్థానాల్లో కేసులూ నమోదయ్యాయి. 2015లో ఈ పత్రిక ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేసినా ఆ తర్వాత పునరుద్ధరించారు. హాఫ్నర్‌ టీవీ షోలనూ, రియాలిటీ షోలనూ నిర్వహించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
views: 1945

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams