Current Affairs Telugu Daily

డబ్ల్యూఈఎఫ్‌ అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌కు 40వ స్థానం
అత్యంత పోటీనిచ్చే ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 40వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన అంతర్జాతీయ పోటీతత్వ సూచీల ప్రకారం గతేడాది ర్యాంకుతో పోలిస్తే భారత్‌ ఒక స్థానం కిందకు వచ్చింది. మొత్తం 137 దేశాల్లో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా, సింగపూర్‌లు వరుసగా రెండో, మూడో స్థానంలో నిలిచాయి.
-భారత్‌ అంతక్రితం ఏడాది 39వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 40వ స్థానంలో నిలిచింది. పోటీతత్వ పునాదులైన మౌలికం(66వ ర్యాంకు), ఉన్నత విద్య, శిక్షణ(75), సాంకేతిక సంసిద్ధత(107) తదితరాల్లో భారత్‌ రాణించింది. 
- బ్రిక్స్‌ దేశాల్లో చైనా, రష్యా(38)లు భారత్‌ కంటే మెరుగ్గానే ఉన్నాయి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లు వరుసగా 61, 80 స్థానాల్లో నిలిచాయి.

views: 2592



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams