Current Affairs Telugu Daily

ప్రపంచ యూత్‌ చెస్‌లో తొలుగు తేజా ప్రతిభ 
ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలుగు తేజాలు జిషిత దనుమూరి, ఎరిగైసి అర్జున్‌ సత్తా చాటారు. ఉరుగ్వేలో జరిగిన ఈ టోర్నీలో జిషిత అండర్‌-14 బాలికల విజేతగా నిలువగా.. అర్జున్‌ అండర్‌-14 బాలుర విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. జిషిత 11 రౌండ్లలో తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ అందుకుంది. జిషిత టాప్‌ సీడ్‌ బిబిసర (రష్యా)ను వెనక్కి నెట్టి టైటిల్‌ సాధించింది. చివరి రౌండ్లో జిషిత ఎహ్ సాని (అమెరికా)ని ఓడించింది. అండర్‌-14 బాలుర విభాగంలో బత్సురేన్‌ (మంగోలియా) టైటిల్‌ గెలవగా, అర్జున్‌ రన్నరప్‌గా నిలిచారు. మరో భారత క్రీడాకారిణి సాక్షి అండర్‌-18 బాలిక విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. జిషిత స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా బల్లిపాడు గ్రామం. అర్జున్‌ స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.
-ఈ విజయంతో జిషిత ఆంధ్రప్రదేశ్‌ నుంచి అండర్‌-14 బాలికల విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2000లో స్పెయిన్‌లో), ద్రోణవల్లి హారిక (2004లో గ్రీస్‌లో) ఈ ఘనత సాధించారు. 
-ఓవరాల్‌గా భారత్‌ నుంచి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆరో క్రీడాకారిణి జిషిత. హంపి, హారికతో పాటు పద్మిని రౌత్‌ (2008లో), మహాలక్ష్మి (2012లో), వైశాలి (2015లో) కూడా టైటిల్స్‌ను సాధించారు.

views: 961



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams