Current Affairs Telugu Daily


కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన 2017 సెప్టెంబర్‌ 27న జరిగిన కేంద్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది.
-అంతర్గత భద్రతలను పటిష్టపరచడానికి రూ.25,060 కోట్లను ‘పోలీసు దళాలు ఆధునికీకరణ’ (ఎంపీఎఫ్‌) పేరుతో ఖర్చు చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేసి, తీవ్రవాదంపై సమర్థంగా పోరాడడానికి ఈ నిధుల్ని 2017-18 నుంచి 2019-20 మధ్య ఖర్చు చేయనున్నారు. అంతర్గత భద్రత, శాంతి భద్రతలు, మహిళ రక్షణ, ఆధునిక ఆయుధాల లభ్యత, పోలీసు దళాల చలనం, వారి రవాణా పరమైన అవసరాలు, హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం, నిస్త్రంత్రీ వ్యవస్థ ఉన్నతీకరణ, జాతీయస్థాయి ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు, నేరాలను-నేరగాళ్లను గుర్తించే వ్యవస్థల్ని సమకూర్చుకోవడం, ఇ-కారాగారాల ఏర్పాటు వంటివన్నీ ఈ ‘ఛత్ర పథకం’లో ఉంటాయి. 
-యుద్ధకల్లోలిత అఫ్గానిస్థాన్‌ తన భద్రత పరికరాలను బలోపేతం చేసుకునేందుకు వీలు కల్పించేలా సాంకేతిక సహకారాన్ని అందించే ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.సంతకాలు జరిగినప్పటినుంచి 5 సం॥ లు పాటు ఇది అమల్లో ఉంటుంది. అవసరమైతే దీనిని మరో 5 సం॥లు పొడిగించుకోవచ్చు.
-ఆయుష్‌, రైల్వే మంత్రిత్వశాఖ కింద పనిచేస్తున్న వారితో సహా కేంద్ర ప్రభుత్వ వైద్యులందరి పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది. కొన్ని విభాగాల్లో ఈ పరిమితి 60 ఏళ్లుగా ఉంటే మరికొన్నింటిలో 62 ఏళ్లుగా ఉంది. ఇప్పుడు వీరందరి పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించడం వల్ల దేశంలో అనుభవజ్ఞ వైద్యు కొరత తీర్చడానికి ఉపయోగపడుతుంది

views: 1039

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams