Current Affairs Telugu Daily

థాయిలాండ్‌ మాజీ ప్రధానికి 5 సం॥లు జైలు శిక్ష
థాయిలాండ్‌ మాజీ ప్రధాని యింగ్లక్‌ షినవత్రాకు ఆ దేశ సుప్రీంకోర్టు 5 సం॥లు జైలు శిక్ష విధించింది. బియ్యం రాయితీ పథకంలో నిర్లక్ష్యం వహించి ఆమె ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలిగించారని కోర్టు తేల్చింది. అయితే విచారణకు యింగ్లక్‌ హాజరుకాలేదు. ఆమె నెల క్రితమే దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం. ఇటు రాజకీయ దురుద్దేశాలతోనే తనపై ఆరోపణలు చేశారని యింగ్లక్‌ వాదించారు. 2014లో సైనిక తిరుగుబాటు కారణంగా యింగ్లక్‌ ప్రభుత్వం కూలిపోయింది. ఆమె సోదరుడు తాక్సిన్‌ షినవత్రా ప్రధానిగా ఉన్న సమయంలోనూ.. 2006లో సైనిక తిరుగుబాటు ఫలితంగానే అధికారం కోల్పోయారు. తాక్సిన్‌ రాజకీయ వారసురాలిగా 2011లో యింగ్లక్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. బియ్యం రాయితీ పథకం ఆమె అధికారం చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ పథకంలో భాగంగా ప్రపంచ మార్కెట్‌ ధర కన్నా 50% ఎక్కువ ధరను చెల్లించి.. రైతుల నుంచి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసింది. దీని ఫలితం దేశ ఎగుమతులపై పడి.. బియ్యం ఉత్పత్తి చేసే మిగతా దేశాలు లాభపడ్డాయి. అతిపెద్ద బియ్యం ఎగుమతిదారులుగా ఉన్న థాయిలాండ్‌ స్థానాన్ని వియత్నాం భర్తీ చేసింది. ఇటు పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. గ్రామీణ ఓటర్లను తనకు విధేయులుగా మార్చుకునేందుకే.. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ యింగ్లక్‌ ఈ పథకం తీసుకువచ్చారని ప్రత్యర్థులు విమర్శించారు.
views: 989

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams