Current Affairs Telugu Daily

మానవ రహిత విమానానంతో భూ సర్వే
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో భాగంగా అన్యాక్రాంతమైన, సమస్యాత్మక ప్రభుత్వ భూములను సర్వే చేసేందుకు మానవ రహిత విమానాన్ని (అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌.. యూఏవీ) రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు ప్రవేశపెట్టారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామ శివారులో 5 దశబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న సర్వే నంబరు 257లోని 620.39 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేయడానికి 2017 సెప్టెంబర్‌ 27న దీన్ని ప్రయోగించారు. బుల్లి విమానాన్ని పోలిన ఇది 150 అడుగుల ఎత్తు నుంచి గంటకు 500 ఎకరాలను సర్వే చేసి ఫొటోలు తీస్తుంది. భూగర్భంలోని నీటి నిల్వలను, 18 భూపొరలను, భూమి పైనున్న 3 సెం.మీ.ల పరిమాణంలో ఉన్న వస్తువును కూడా చిత్రీకరిస్తుంది. ఈ సర్వే పద్ధతి చాలా ఆధునికమైంది. రైతుల్లో అపోహలు తలెత్తకుండా ప్రతి అణువును గుర్తించి సర్వే చేస్తుంది. దీనివల్ల భూమి కొతలు, సర్వే నంబరులోని ఉప సంఖ్య వివరాలు కూడా తెలుసుకోవచ్చు. 
views: 1141

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams