Current Affairs Telugu Daily

ONGC ఛైర్మన్‌గా శశిశంకర్‌
దేశీ దిగ్గజ ఆయిల్‌, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ ONGC కొత్త చైర్మన్‌ మరియు ఎండీగా శశిశంకర్‌ నియమితులయ్యారు. ఈయన 2021 మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ONGCలో డైరెక్టర్‌గా (టెక్నికల్‌ అండ్‌ ఫీల్డ్‌ సర్వీసెస్‌) ఉన్న శశిశంకర్‌ను అదే సంస్థ సీఎండీగా పదోన్నతి కల్పిస్తూ ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన రిటైర్మెంట్‌ పొందే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగుతారు. కాగా శశిశంకర్‌ 2017 అక్టోబర్‌ 1న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన దినేశ్‌ కె ష్రాఫ్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.
ONGC-Oil and Natural Gas Corporation

views: 974

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams