Current Affairs Telugu Daily

ఫార్చ్యూన్‌ అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చందా కొచర్‌, శిఖాశర్మ
ఫార్చ్యూన్‌ తాజాగా అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్‌, శిఖాశర్మలకు స్థానం దక్కింది. ఇద్దరూ బ్యాంకింగ్‌ రంగానికి చెందినవారే. ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచర్‌ 5వ స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ సీఈవో శిఖాశర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాస్టర్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అన బొటిన్‌ అగ్రస్థానంలో నిలవగా, జీఎస్కే సీఈవో ఎమ్మా వాల్‌ స్లే 2వ స్థానంలో ఎంజీ సీఈవో ఇసబెల్లా కొచర్‌ 3వ స్థానంలో నిలిచారు. 8 సం॥లుగా భారత్‌లోని అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐకి చందా కొచర్‌ నేతృత్వం వహిస్తున్నారు. భారత్‌లోని మూడో అతిపెద్ద ప్రైవేట్‌రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా శిఖాశర్మ రెండోమారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
views: 994

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams